జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి


Sat,October 5, 2019 11:21 PM

సిద్దిపేట అర్బన్ : యువత జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అభయ జ్యోతి డైరెక్టర్ జోజి పేర్కొన్నారు. నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల జాతీయ యువజన వలంటీర్లకు 15 రోజుల శిక్షణ కార్యక్ర మాన్ని శనివారం ఇందూరు కళాశాలలో ముగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గా హాజరైన ఆయన మాట్లాడుతూ..యువత అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. నెహ్రూ యువకేంద్రం జిల్లా నామిని మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 15 రోజుల శిక్షణ తరగతులను వలంటీర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని బ్లాకుల్లో యువజన సం ఘాలను సంఘటితపరిచి దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. అనం తరం వలంటీర్లకు శిక్షణ తరగతులకు సంబంధించిన సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఇందూరు కళాశాల డైరెక్టర్ రఘు, తోఫిక్, ట్రైనింగ్ ఇన్‌చార్జి రాంబాబు, నెహ్రూ యువకేంద్రం సభ్యులు కిరణ్‌కుమార్, నరేష్, లక్ష్మణ్, లింగం, విజయ్ ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...