పల్లెల్లో ప్రణాళిక స్ఫూర్తినే కొనసాగించాలి


Sat,October 5, 2019 11:21 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ : గ్రామ సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్య పరిచారు. సర్పంచ్, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టిసారించి ప్రగతి పనులు చేపట్టారు. శనివారం దుబ్బాక మండలంలో ఎనగుర్తి, చిన్ననిజాంపేట, హబ్షీపూర్, కమ్మర్‌పల్లి, గంభీర్‌పూర్, బొప్పాపూర్, అచ్చుమయిపల్లి, అప్పనపల్లి, ఆకారం, చీకోడ్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు.

మిరుదొడ్డి : సీఎం కేసీఆర్ సూచించిన ప్రకారం పల్లెల్లో సర్పంచ్‌లు 30 రోజుల పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించి గ్రామాల రూపురేఖలను మార్చి వేశారని జడ్పీ సీఈవో శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని జంగపల్లి, చెప్యాలల్లో ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ లక్ష్మి, ఎంపీడీవో పి.సుధాకర్ రావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో పలు వీధులతో పాటు ఎస్సీ కాలనీల్లో తిరుగుతూ అక్కడి ప్రజలను గతంలో మీ కాలనీలు ఏ విధంగా ఉన్నాయి..? ప్రణాళిక పనులు అమలు తర్వాత ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చాలా పరిశుభ్రంగా ఉన్నాయి సార్ అంటూ ప్రజలు సీఈవోకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కంచం యాదగిరి, మాచపురం లక్ష్మి, ప్రత్యేక అధికారులు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.
తొగుట : పరిశుభ్రత, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి, ఎల్లారెడ్డిపేట, చందాపూర్ సర్పంచ్‌లు చిలువేరి జ్యోతి మల్లారెడ్డి, సిరినేని గోవర్దన్‌రెడ్డి, బొడ్డు నర్సింహులు కోరారు. శనివారం కార్యక్రమంలో ప్రత్యేకాధికారి నవీన్‌కుమార్, ఉపసర్పంచ్ సురేశ్‌గౌడ్, కార్యదర్శి సమీర్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేటలో సర్పంచ్ సిరినేని గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో దోమల నివారణ మందును పిచికారి చేశారు. జప్తిలింగారెడ్డిపల్లిలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను సర్పంచ్ బొడ్డు నర్సింహులు చొరవతో పరిష్కరించారు. గ్రామానికి చెందిన ఆత్మకూరు నాగేశ్వర్, బెజగామ చంద్రయ్య 30 గజాల సొంత భూమిని రోడ్డు కోసం ఇవ్వడంతో రోడ్డు వెడల్పు చేశారు. స్థలం ఇచ్చినందుకు వారిని సర్పంచ్ సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చంద్రం పాల్గొన్నారు.

పరిశుభ్రంగా పల్లె సీమలు..
మిరుదొడ్డి : మండలంలోని 20 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులు సమిష్టిగా పనులు చేయడంతో పల్లెల్లో ఎంతో పరిశుభ్రత నెలకొంది. శనివారం అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా సర్పంచ్‌లు గ్రామసభలు నిర్వహించుకొని ఎక్కడా చెత్త వేయకుండా చూసుకుంటూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని గ్రామసభల్లో తీర్మానాలు చేసుకున్నారు.

అప్పాయిపల్లిలో అభివృద్ధి పంతం..
దౌల్తాబాద్ : సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపటిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో పనులలో భాగంగా అప్పాయిపల్లిలో ఎక్కడ చూసినా క్లీన్ అండ్ గ్రీన్‌గా కనిపిస్తున్నది. మండలంలోని ప్రభుత్వ అధికారులు, పంచాయితీ సిబ్బంది గ్రామస్తులు కలసి గ్రామన్ని సుందరంగా మార్చారు. నూతనంగా ఏర్పాడిన పంచాయితీలో ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన చెత్తాచదారాన్ని ఏరివేశారు. గ్రామంలో 95 శాతం ఇంకుడు గుంతలు 95 శాతం మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...