సద్దుల బతుకమ్మకు పక్కా ఏర్పాట్లు


Sat,October 5, 2019 11:20 PM

దుబ్బాక టౌన్ : సద్దుల బతుకమ్మను వైభవంగా జరుపుకోవడానికి నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. దుబ్బాకలో ఆదివారం ఘనంగా నిర్వహించే సద్దుల బతుకమ్మ నిమజ్జనానికి మున్సిపాలిటీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమైనారు. దుబ్బాక పెద్ద చెరువు కట్టపై లైటింగ్ ఏర్పాటు పనులు శనివారం సాయంత్రం వరకు కొనసాగాయి. దుబ్బాక నుంచి లచ్చపేట మధ్య గల పెద్ద చెరువు కట్ట పొడువున లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాలతో పాటు బతుకమ్మను ఆడే ప్రాంతాల్లో లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బతుకమ్మ ఊరేగింపు సాగే రోడ్ల వెంట, చెరువు కట్ట పై చదును చేసే పనులను కమిషనర్ గోల్కొండ నర్సయ్య, సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్, దుంపలపల్లి గ్రామాల్లో సైతం సద్దుల బతుకమ్మకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తొగుట : మండలంలో ఆదివారం నిర్వహించే సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. తుక్కాపూర్‌లో సర్పంచ్ చిక్కుడు చంద్రం ఆధ్వర్యంలో బతుకమ్మ కోసం జేసీబీ, ట్రాక్టర్‌తో ఏర్పాట్లు చేశారు. లింగాపూర్‌లో టీఆర్‌ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తగరం అశోక్ స్వయంగా బతుకమ్మ మెట్లను శుభ్రం చేయడంతో పాటు రంగులు కూడా వేసారు. అలాగే వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ కోసం విద్యుత్ లైట్లు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...