వేడుక అదిరింది


Sat,October 5, 2019 11:20 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబురాలకు శనివారం కోమటి చెరువు వేదికైంది. కలెక్టరేట్ ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగులు కోమటిచెరువు వద్ద నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఉత్సవాలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. సద్దుల బతుకమ్మకు కోమటి చెరువుపై అద్భుతమైన ఏర్పాట్లు చేశారని జేసీ పద్మాకర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ పాలకవర్గానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్ నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే బతుకమ్మ నాటికి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. సిద్దిపేట అక్కాచెల్లెళ్లందరికీ అయురారోగ్యాలతో మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. దసరా బతుకమ్మ పండుగను ప్లాస్టిక్ రహిత పండుగగా జరుపుకుందామని కోరారు. కోమటిచెరువు కట్టపై దాదా పు 3 గంటల పాటు చైర్మన్ రాజనర్సు, టూరిజం అధికారి సుదర్శన్‌తో కలిసి కలియతిరిగారు. బ్యాటరీ వాహనంలో కట్టపై తిరుగుతూ లైటింగ్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై సూచనలు చేశారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్శణగా నిలువగా వారికి బహుమతులు అందజేశారు. వేడుకల్లో జేసీ పద్మాకర్ సతీమణి శశికళ, డీఆర్‌వో చంద్రశేఖర్ సతీమణి శ్రావణి, సీపీ జోయల్ డెవిస్ సతీమణి, డీఎస్‌వో శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మహిళా ఉద్యోగులు భారీ సంఖ్యలో బతుకమ్మ సంబురాల్లో పాల్గొని బతుకమ్మ, కోలాటం ఆటలాడి ఉత్సాహంగా గడిపారు. 30 రోజుల ప్రణాళికలో రూ పొందించిన సాంప్రదాయ, స్వచ్ఛ హరిత బతుకమ్మ అందర్ని ఆకట్టుకుంది.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...