విజయవంతంగా కొనసాగుతున్న ప్రగతి పనులు


Sat,October 5, 2019 12:14 AM

దుబ్బాక,నమస్తే తెలంగాణ : గ్రామ సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్యపరిచారు. సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకంగా దృష్టిసారించి ప్రగతిపనులు చేపట్టారు. శుక్రవారం దుబ్బాక మండలంలో చిట్టాపూర్, పోతారం, హబ్షీపూర్, కమ్మర్‌పల్లి, గంభీర్‌పూర్, బొప్పాపూర్, చిన్ననిజాంపేట, చీకోడ్ తదితర గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు.

పచ్చదనం-పరిశుభ్రతే లక్ష్యం..
తొగుట : పరిశుభ్రత, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చే యాలని మండల ప్రత్యేకాధికారి నాగరాజు, ఎంపీడీవో రాజిరెడ్డి అన్నారు. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి, చందాపూర్‌లో 30 రోజుల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగిందని, ఇక నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పచ్చదనం, పరిశుభ్రత కోసం కృషి చేయాలన్నారు. జప్తిలింగారెడ్డిపల్లిలో జేసీబీ పనులను పరిశీలించారు. చందాపూర్‌లో వేస్ట్ కలెక్షన్ యూనిట్ ను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చిలువేరి జ్యోతి మల్లారెడ్డి, బొడ్డు నర్సింహులు, ప్రత్యేకాధికారులు నవీన్ కు మా ర్, శ్రీలక్ష్మి తదితరులున్నారు. గోవర్ధనగిరి, లింగంపేట, పెద్దమాసాన్‌పల్లి, వేములఘాట్, గుడికందుల సర్పంచ్‌లు తొయేటి ఎల్లం, మంగ రేణుక, మెట్టు వరలక్ష్మి, సిద్దిపేట బాలయ్య, గంగనిగల్ల మల్లయ్య, ప్రత్యేకాధికారి ఇనుగాల మమతల ఆధ్వర్యంలో గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.

అద్దాల్లా మెరుస్తున్న గ్రామాలు..
రాయపోల్ : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రో జుల ప్రణాళిక పనులు గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. పల్లె ప్రణాకళికలో భాగంగా మండంలోని ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మండలంలోని అనాజీపూర్, మంతూర్, రాయపోల్, రామారం,వడ్డేప ల్లి,తిమ్మక్కపలి,టేంకంపేట, ఎల్కల్, గొల్లపల్లి గ్రామాల్లో శుక్రవారం పారిశుధ్య పనులు చేపట్టారు.మురికి కాలువల శు భ్రం,పాత బావుల పుడ్చివేత, పాత ఇండ్లు కూల్చివేశారు. ఆయా గ్రామాల్లో వీధులను పరిశుభ్రం చేశారు. జేసీబీలు,ట్రాక్టర్ల ద్వారా పారిశుధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన పనులను మండల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ప్రణాళికతో పల్లెల ప్రగతి..
మిరుదొడ్డి : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన 30 రోజులు పల్లె ప్రగతి ప్రణాళిక పనుల ద్వారా లక్ష్మీనగర్ గ్రామం పరిశుభ్ర
గ్రామంగా రూపు దిద్దుకుంటుందని సర్పంచ్ పిట్ల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి ప్రణాళిక పనులు సర్పంచ్‌ల, ప్రత్యేక అధికారుల సమక్షంలో జోరుగా కొనసాగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఏండ్ల నాటి నుంచి గ్రామంలో పేరుక పోయిన పెంట కుప్పలు ఎత్తివేసి, పాత ఇండ్లను కూల్చివేసి, ఇండ్ల పాడు బడిన బావులను పూడ్చి వేసి పిచ్చి మొక్కలను తొలిగించడంతో గ్రామం నేడు ఎంతో పరిశుభ్రంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ సూచించిన ప్రకారం ఇదే స్ఫూర్తిని ఎప్పటికీ గ్రామంలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...