సంబురంగా బతుకమ్మ ఆటపాటలు


Sat,October 5, 2019 12:12 AM

దుబ్బాక టౌన్ : బతుకమ్మ సంబురాలు దుబ్బాక పట్టణంలో కన్నులపండుగగా సాగుతున్నాయి. శుక్రవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ముందు బతుకమ్మ ఆటపాటలతో బతుకమ్మను ఆడారు. సీడీపీవో సంధ్యారాణి, సూపర్‌వైజర్లు నాగమణి, రాణి, లక్ష్మి, అనురాధ, చంద్రకళ, అంతుల్‌షరీన్, అంగన్‌వాడీ టీచర్లు సత్యలక్ష్మి, చంద్రకళ, జయ, సుజాత, విజయ, పద్మతో పాటు మండలంలోని పలుగ్రామాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు ఆడారు. అదేవిధంగా మెప్మా ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాయలం ముందు మహిళా సమైఖ్య బాధ్యులు బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, మెప్మా సీవో రాజు, లక్ష్మి, నర్సవ్వ, నాగలక్ష్మి, లావణ్య, మమత, సునీత తదితరులు పాల్గొన్నారు.దౌల్తాబాద్ : మండలంలోని ఆయా గ్రామల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. అనంతరం దగ్గర ఉన్న చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...