11న శ్రీకృష్ణ యాదవ సంఘం


Sat,October 5, 2019 12:12 AM

-కల్యాణ మండపం ప్రారంభోత్సవం
సిద్దిపేట అర్బన్ : 11న జరిగే యా దవ సంఘం క ల్యాణ మ ండపం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా గొర్రెల ,మేకల పెంపకం దారుల సహకార సంఘం యూ నియన్ చైర్మన్ పోచబోయిన శ్రీహరియాదవ్ అన్నారు. శుక్రవారం యాదవ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవ సంఘానికి సీఎం కేసీఆర్ స్థలం కేటాయించగా, మంత్రి హరీశ్‌రావు భవన నిర్మాణానికి సహకరించటం సంతోషంగా ఉందన్నారు. కల్యాణ మం డపం నిర్వాహణ కమిటీని శనివారం మధ్యాహ్నం కల్యాణ మండపంలో ఎన్నుకుంటామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ స్థాయి యాదవ కుల సభ్యులు ఈ నిర్వాహణ కమిటీ ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. నిర్వాహణ కమిటీలో పాల్గొనే యాదవ సంఘం సభ్యులు 6 వేల రూపాయల సభ్యత్వ రుసుం చెల్లించాల్సి ఉంటుందని సభ్యత్వ రుసుము కట్టిన వారికి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 11న ప్రారంభం కానున్న యాదవ కల్యాణమండపం కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆలిండియా యదవసంఘం కౌన్సిల్ సభ్యులు పయ్యావులరాములు, యాదవ సంఘం సభ్యులు యాదగిరి, బాలమల్లు, పర్శరాములు, కృష్ణ, రాములు, పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...