ఆయన మరణించి చూపునిచ్చాడు


Sat,October 5, 2019 12:11 AM

కోహెడ : మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు జగన్నాధం వెంకట సత్తయ్య(85) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందాడు. వెంకట సత్తయ్య బతికి ఉన్నప్పుడు నేత్ర దానానికి అంగీకార పత్రం ఇవ్వడంతో భార్య మంగతాయారు లయన్స్ క్లబ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో మండల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కోహెడ ప్రసాదరావుశర్మ కరీంనగర్ రేకుర్తి దవాఖాన సిబ్బంది సౌజన్యంతో సత్తయ్య నేత్రాలను సేకరించారు. నేత్రాలను హైదరాబాద్ కంటి దవాఖానకు పంపించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సింగిరెడ్డి మల్లారెడ్డి, శ్రీరంగం రామాచారి, గ్రామస్తులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...