స్టేషన్ రైటర్లకు చట్టాలపై అవగాహన


Sat,October 5, 2019 12:11 AM

సిద్దిపేట టౌన్ : స్టేషన్ రైటర్లు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం చేయగలుగుతామని స్టేషన్ రైటర్ వర్టికల్ నోడల్ అధికారి, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవి అన్నారు. శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్టేషన్ రైటర్లకు చట్టాల పై అవగాహన కోసం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 420 చీటింగ్ కేసుల్లో సీజ్ చేయాల్సిన డాక్యుమెంట్లు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలో, పరిశోధన చేసే క్రమంలో కేసుల్లో సీజ్ చేసే వస్తువులను పంచ్‌ల సమక్షంలో సీజ్ చేయాలని సూచించారు. ప్రతి చార్జీషీట్ చెక్‌లిస్టు ఉండాలని వారు సూచించారు. ఇన్వెస్టిగేషన్‌లో చేయాల్సిన పద్ధతులు, చేయకూడని పద్ధతులపై వివరంగా తెలిపారు. చీటింగ్ కేసులు, యాక్సిడెంట్ కేసుల్లో పరిశోధన పద్ధతులపై వివరించారు. ఎఫ్‌ఐఆర్ రాసేటప్పుడు 161 స్టేట్‌మెంట్స్, రిమాండ్ డైరీ, చార్జీషీట్, పంచనామాలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మహబూబ్‌ఖాన్ శిక్షలు పడిన కేసుల గురించి వివరించారు. పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ రైటర్లకు చట్టాలపై అవగాహన కలిగించే క్రిమినల్ లా కంపెడియన్ పుస్తకాలను ఈ సందర్భంగా అందజేశారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...