వైభవంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు


Fri,October 4, 2019 12:03 AM

దుబ్బాక,నమస్తే తెలంగాణ : మండలంలో దే వీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం కూడవెళ్లి రామలింగేశ్వరాలయంలో, చౌదర్‌పల్లి దుబ్బరాజేశ్వరాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో రఘోత్తంపల్లిలో కాళికా యూత్, రామక్కపేట పద్మశాలీ యువజన సంఘం , చీకోడ్‌లో ఛత్రపతి శివాజీ యూత్, పెద్దగుండవెళ్లిలో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రామక్కపేటలో అన్నదాన కార్యక్రమం ని ర్వహిస్తున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఇందుకు భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.దుబ్బాక టౌన్ : దుబ్బాకలో నాలుగు రోజులుగా దేవీ శరన్ననవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శినమిస్తున్నారు. గురువారం స్థానిక రేపల్లె వాడలో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారి వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బట్టు ఎల్లం, గన్నె భూంరెడ్డి, నక్కబాల వెంకన్న, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...