ఓటరు లిస్టు పరిశీలన వేగవంతం చేయాలి


Fri,October 4, 2019 12:03 AM

ఓటరు లిస్టు పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్‌వో చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు లిస్టు పరిశీలన కార్యక్రమం జరుగుతున్న తీరును రాష్ట్ర ఎన్నికల అధికారికి నివేదించారు. ఈ సందర్భంగా రజత్‌కుమార్ మాట్లాడుతూ నజిరి నక్ష తయారు చేయుట, ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు లిస్టులో ఏవైనా పేర్లు, ఓటరు ఫొటోలు పలుమార్లు రావడం, పేర్లు అచ్చుతప్పు ఉండడం వంటి వాటిని గుర్తించి సరిచేయాలన్నారు. అదే విధంగా నూతనంగా నమోదు చేసుకునే వారి నివేదికను సమర్పించాలన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...