సాగు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి


Fri,October 4, 2019 12:02 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : పంటల సాగు విస్తీర్ణం వివరాలను ఏఈవోలు ఈ నెల 10లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి అన్నారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, మార్కెటింగ్ కమిషనర్ లక్ష్మీబాయి, వ్యవసాయ, మార్కెటింగ్, కో ఆపరేటివ్, గణాంకశాఖ, హార్టికల్చర్, సీజ్ కార్పొరేషన్ శాఖలతో కలిసి సంబంధిత శాఖల్లో జరుగుతున్న పనుల తీరుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ పద్మాకర్, వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి మాట్లాడుతూ పంటల సాగు విస్తీర్ణం ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు వ్యవసాయ, సంబంధిత శాఖలు తుది విస్తీర్ణపు పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలన్నారు. వానకాలం 2019 -2020 సంవత్సరానికి గాను పంటలు సాగు వివరాలు, కావాల్సిన విత్తనాలు, ఎరువులు తదితర వివరాలతో కూడిన నివేదిక రూపొందించి సమర్పించాలన్నారు. రైతుబంధు, రైతుబీమా వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. జేసీ పద్మాకర్ మాట్లాడు తూ 4,500 క్వింటాళ్ల శనగ, 3 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరమున్నట్లు తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...