అలిగిన బతుకమ్మ సంబురాలు..


Fri,October 4, 2019 12:02 AM

ఆరో రోజు బతుకమ్మ సంబురాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలతో పాటు అన్ని గ్రామాల్లో వేడుకలు కొనసాగాయి. వాడవాడలా మహిళలు, చిన్నారులు, యువతులు సంప్రదాయబద్ధంగా కట్టుబొట్టుతో బతుకమ్మలాడారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని బొగ్గులోనిబండలో, దుబ్బాక మండలంలోని రామక్కపేటతోపాటు మిరుదొడ్డి మండల కేంద్రంలో బతుకమ్మ సంబు రాలు నిర్వహించారు. అనంతరం మహిళలు బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేశారు.- కలెక్టరేట్ / దుబ్బాక, నమస్తే తెలంగాణ

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...