సాహిత్యానికి నిలయం సిద్దిపేట


Fri,October 4, 2019 12:02 AM

సిద్దిపేట టౌన్ : సాహిత్య ప్రక్రియలకు సిద్దిపేట నిలయమని మణిపూసలు ప్రక్రియ రూపకర్త వడిచెర్ల సత్యం అన్నారు. సిద్దిపేట సాయిబాబా దేవాలయంలో షిర్డీ సాయిబాబా చరితం పుస్తకాన్ని గురువారం కవులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. సిద్దిపేటలో మణిపూసలు రచనకు చోటు దక్కడం సంతోషకరమన్నారు. సాయిచరితం పాడుకునేందుకు అనువుగా ఉందన్నారు. సాహిత్యం అధ్యయనం చేయాలని యువ రచయితలకు సూచించారు. సమాజ చైనత్యం కోసం కృషి చేస్తున్న సిద్దిపేట కవులు భవిష్యత్ తరాల వారికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారన్నారు. ప్రెస్ అకాడమీ సభ్యుడు కొమురవెల్లి అంజయ్య మాట్లాడుతూ.. రచయితలు సమాజంలో మార్పునకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. షిర్డీ సాయిబాబా జీవిత చరితను రాయడం తన అదృష్టమని రచయిత శ్రీచరణ్ సాయిదాస్ అన్నారు. కార్యక్రమంలో బాల సాహితీవేత్త ఉండ్రాల రాజేశం, కవులు చంద్రయ్య, నర్సయ్య, రవి, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, బస్వరాజ్‌కుమార్, కాపు రమేశ్, యాదగిరి, ఎడ్ల లక్ష్మి ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...