నీ మార్గం..సదాస్మరామి


Wed,October 2, 2019 11:36 PM

సిద్దిపేట టౌన్ :అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహాత్ముడి 150వ జయంతి బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అన్ని ప్రాంతాల్లో జాతిపిత చిత్రపటాలకు నివాళులర్పించారు. ఆయన బోధనలు, నడవడిక ప్రజలకు ఆచరణీయమని పలువురు సూచించారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి జేసీ పద్మాకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి

పూలమాలేసి నివాళులర్పించారు.
గాంధేయవాదాన్ని అందరూ అలవర్చుకోవాలని జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి భ వానీప్రసాద్ అన్నారు. సిద్దిపేట సబ్‌జైలులో మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. మహాత్మాగాం ధీ అడుగు జాడల్లో నేటి యువత నడువాలన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన అహింస మార్గంలో చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, కోర్టు సిబ్బంది ఆత్రేయ, శ్రీనివాస్, మురళి, ఎల్లయ్య, రమేశ్, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టీఎన్‌జీవో ఆధ్వర్యంలో..
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ అహింస మార్గంలో ఉద్యమాన్ని నడిపి స్వాతంత్య్రం తీసుకవచ్చారని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని గాంధీ చౌక్ వద్ద గాందీ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో అసొసియేషన్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, టౌన్ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, రూరల్ అధ్యక్షుడు అశ్వాక్ అహ్మద్, ట్రెజరర్ అజీమ్, నాయకులు కృష్ణ, జనార్దన్, నర్సింహులు, దేవేందర్, హెచ్‌డబ్ల్యూవో పరమేశ్వర్ ఉన్నారు.

జడ్పీ కార్యాలయంలో..
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : గాంధీ చూపిన బాటలో అందరం పయనిద్దామని జిల్లా పరిషత్ సీఈవో శ్రావణ్‌కుమార్ అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు పురస్కరించుకొని జడ్పీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ శ్రీదేవి, నారాయణరావుపేట ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, జడ్పీటీసీలు శ్రీహరిగౌడ్, తడిసిన ఉమ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...