బ్రహ్మాండంగా ప్రణాళిక పనులు : ఎంపీపీ లక్ష్మి


Wed,October 2, 2019 10:45 PM

అక్కన్నపేట: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పనులు మం డలంలోని అన్ని గ్రామాల్లో బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని, దీంతో ప్రభుత్వం లక్ష్యం కూడా మరో మూడు రోజుల్లో నెరవేరబోతుందని ఎంపీపీ మాలోతు లక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో 30 రోజుల ప్రణాళిక పనులు, గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయాలు ఇతరత్రా అంశాలపై జరిగిన గ్రామ సభలో ఎంపీపీ లక్ష్మి పాల్గొని మాట్లాడారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. 30 రోజుల ప్రణాళిక పనులతో క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా మారితే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవిస్తారన్నారు. అంతకుముందు పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొప్పుల సత్యపాల్‌రెడ్డి, సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలోతు బీలునాయక్, ఎంపీటీసీ పెసరు సాంబరాజు, ఉపసర్పంచ్ పీరెల్ల రాధ, కార్యదర్శి సరస్వతి, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, హరితహారం, పారిశుధ్యం, వీధిదీపాలు, పనుల కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...