సమాజ సేవలో యువత ముందుండాలి


Wed,October 2, 2019 10:45 PM

హుస్నాబాద్‌రూరల్: సమాజ సేవలో యువత ముం దుండాలని హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస అన్నారు. బుధవారం మండలంలోని పోతారం(ఎస్) గ్రామంలో యువమిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆమె ఎంపీడీవో దమ్మని రాముతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మానస మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బత్తిని సాయిలు, ఉపసర్పంచ్ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఆలేటి కొండల్‌రెడ్డి, కవి అన్నవరం దేవేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...