ఇంగ్లిష్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన జాయింట్ డైరెక్టర్ రమేశ్


Wed,October 2, 2019 10:45 PM

సిద్దిపేట ఎడ్యుకేషన్ : సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇంగ్లిష్ శిక్షణ శిబిరాన్ని సమగ్ర శిక్షణ జాయింట్ డైరెక్టర్ రమేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలవు రోజుల్లో కూడా ఉపాధ్యాయులు శ్రద్ధతో శిక్షణకు హాజరై మొలకువలను, నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రలోని మిగతా జిల్లాల కంటే సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులు ఒక అడుగు ముందు ఉన్నారన్నారు. అనంతరం రాణి భాస్కర్‌చే కూర్చబడినటువంటి ఇంగ్లీష్ ప్రైజెస్ ఎట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనే కరదీపికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి తాళ్లపల్లి రమేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి, స్వర్గం రవీందర్, సాదత్ ఆలీ, మహేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...