పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం


Fri,September 20, 2019 11:19 PM

దుబ్బాక టౌన్ : పరిసరాల ప రిశుభ్రతతోనే సంపూర్ణ ఆ రో గ్యం సమకూరుతుందని ము న్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య అన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం పైన మహిళా సంఘాల గ్రూపులకు అవగాహన కార్యక్రమం శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యా లయంలో జరిగింది. ఈ కార్య క్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, చెత్తను రోడ్ల పై వేయకూడదని సూచించారు. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తి స్థా యిలో నిషేధిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. పోషణ్ అభియాన్‌పై గర్భిణులు, బాలింతలకు మహిళా సంఘాల సభ్యులు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మె ప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ రాజు, హెల్త్ అసిస్టెంట్ షాదుల్లా, సమైఖ్య అధ్యక్షురాలు దేవుని ల లిత, నాగలక్ష్మి, లక్ష్మీనర్సవ్వ, ఆర్పీలు కృష్ణవేణి, శ్యామల, లావణ్య, సునిత, చందన, శిరీష, కవిత, రజిత పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం ఇటీవల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న కమిషనర్ నర్సయ్యను మహిళా సంఘాల సభ్యులు సన్మానించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...