విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : ఎంపీపీ


Fri,September 20, 2019 11:18 PM

మిరుదొడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను అర్హులకు అందకుండా తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే వారిని సహించేది లేదని ఎంపీపీ గజ్జెల సాయిలు అన్నారు. శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన తహసీల్దార్ కార్యాలయంలో మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో వైద్యాధికారి మల్లికార్జున్ మాట్లాడుతుండగా మోతె సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ లేచి మా గ్రామానికి చెందిన ఏఎన్‌ఎంను వేరే గ్రామానికి పంపించడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకవచ్చారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాట్లాడుతూ వైద్య సిబ్బంది గ్రామాల్లో ఎక్కడా కూడా సక్రమంగా తమ విధులను నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన డాక్టర్ వైద్య సిబ్బంది కొరత ఉన్నందు వల్ల కొన్ని సమస్యలు తలెత్తున్నాయని, ప్రజలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మండల వ్యాప్తంగా రెవెన్యూ సర్వేయర్ దుర్గాప్రసాద్ మూలంగా రైతులు తమ భూములను కోల్పోతున్నారని మోతె సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చాట్లపల్లి బాలమల్లేశంగౌడ్ మండిపడ్డారు. మండలానికి రాకుండా సర్వేయర్ ఇంతర మండలాల్లోని గ్రామాల్లో ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

గ్రామాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సర్వేయర్‌ను విధుల నుంచి తొలిగించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించింది. విద్యుత్ ఏఈ పృథ్వీరాజ్ తమ విధులుపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో వంగి ఉన్న ఇనుప స్తంభాలను తొలిగించి కొత్త స్తంభాలను వేసి, త్రీ ఫేజ్ లూజ్ వైర్లను సరి చేయాలని సూచించారు. స్పందించిన ఏఈ గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను వారం రోజుల్లో తీర్చుతానని సభకు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాణి సక్రమంగా విధులు నిర్వహించక పోవడంతోనే అంగన్ వాడీ సెంటర్లు కొన్ని మూత పడి తాళాలు తీయకుండా ఉంటున్నాయని ప్రజాప్రతి నిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించి సూపర్ వైజర్ అంగన్‌వాడీ టీచర్లు విధులు సక్రమం గా నిర్వహించేలా తగు చర్యలు తీసుకూంటూనే నేను నిత్యం ప ర్యవేక్షణ చేస్తానని తెలిపారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనులు చే యాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 30 రోజులు ప్రగతి పనుల్లో అందరూ పాల్గొనాలని పేర్కొన్నారు. కార్యక్రమం లో జడ్పీటీసీ సూకురి లక్ష్మి, వైస్ ఎంపీపీ పోలీసు రాజులు, ఎంపీడీవో పి.సుధాకర్ రావు, తహసీల్దార్ బి.పద్మారావు, ఆయా గ్రా మాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...