పచ్చి మోసం బహిర్గతం


Fri,September 20, 2019 11:18 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: సాధారణ బఠానీలను నానబెట్టి, వాటికి ఆకుపచ్చ రంగు వేసి, పచ్చిబఠానీలుగా నమ్మించి మార్కెట్‌లో విక్రయిస్తున్న ఆరుగురు వ్యాపారులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హుస్నాబాద్ ఎస్‌ఐ దాస సుధాకర్ వివరాల ప్రకారం.. హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం జరిగే అంగట్లో పచ్చిబఠాణీల పేరుతో రంగు కలిపి మోసానికి పాల్పడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది వెళ్లి తనిఖీలు చేశారు. సదరు వ్యక్తులు విక్రయిస్తున్న పచ్చిబఠానీలను నీళ్లలో వేయగా, నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారాయి. అక్కడ విక్రయించే అన్ని బఠానీలు ఇలాగే ఉండడంతో వీటిని విక్రయిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని బఠానీలను సీజ్ చేశారు.

పచ్చిబఠానీలని వినియోగదారులను మోసం చేస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లికి చెందిన జక్కుల గౌరమ్మ, మొగిలి బుజ్జమ్మ, జక్కుల కమలమ్మ, మొగిలి సారమ్మ, జక్కుల లక్ష్మీ, జక్కుల సారమ్మపై ఆహార పదార్థాల కల్తీకి పాల్పడినందుకు గానూ ఐపీసీ 272 సెక్షన్ కింద సుమోటోగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. ఆహారపదార్థాలను కల్తీ చేసినట్లు గుర్తించినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారమివ్వాలని ఎస్‌ఐ కోరారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...