క్రీడల్లో జిల్లాను ముందుంచాలి


Fri,September 20, 2019 11:17 PM

సిద్దిపేట ఎడ్యుకేషన్ : ఆటల్లో గెలుపోటములు సహజమని, ఆటల్లో జిల్లాను ముందుంచాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ ఆకాంక్షించారు. ఓడిపోయిన వారు బాధపడకుండా విజయం కోసం ప్రయత్నించాలన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాలికల అండర్-17, 14 వాలీబాల్ క్రీడలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. క్రీడల్లో జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాలని, అందుకోసం కావాల్సిన సహాయ సహకారాలను తాము అందిస్తామన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి భిక్షపతి మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల నుంచి అండర్ 17, 14 విభాగం నుంచి సుమారు 430 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామవిద్యా ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు తోట సతీష్, ప్రధాన కార్యదర్శి కందుల హరికిషన్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..
వాలీబాల్ బాలికల అండర్ 17, 14 విభాగంలో గెలుపొందిన క్రీడాకారులకు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, డిప్యుటీ డీఈవో పెద్ది వైకుంఠం, మండల విద్యాధికారి యాదవరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధి అశోక్, మాజీ కార్యదర్శి సుజాత బహుమతులు అందజేశారు. వాలీబాల్ అండర్ 17 బాలికల విభాగంలో ప్రథమ బహుమతి కొండపాక మండలం, ద్వితీయ బహుమతి జగదేవ్‌పూర్ మండలం విజయం సాధించాయి. అండర్ 14 బాలికల వాలీబాల్ విభాగంలో మొదటి బహుమతి సిద్దిపేట అర్బన్ మండలం, ద్వితీయ బహుమతి నంగునూర్ మండలం క్రీడాకారులు విజేతలుగా నిలిచారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...