సమాజ అభివృద్ధి లో టీచర్లు కీలకం


Thu,September 19, 2019 11:13 PM

తొగుట : సమాజానికి దశ, దిశగా ఉపాధ్యాయులు సామాజాభివృద్ధికి పనిచేస్తున్నారని ఎంపీపీ గాంధారి లత పేర్కొన్నారు. తొగుట-రాంపూర్‌లోని చెరుకు బాలమ్మ-బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమైందని, విద్యను సమాజానాకి అందించడంలో ఉపాధ్యాయులు వారధులుగా పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు అంకితభావం, నైతిక విలువల కలిగిన విద్యను అందించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఈవో సత్తు యాదవరెడ్డి, ఉపాధ్యాయులు ఎంపీపీని ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకున్న వారిని ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో మండలంలోని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...