ఇర్కోడు గ్రామానికి జాతీయ పురస్కారం


Thu,September 19, 2019 11:12 PM

సిద్దిపేట రూరల్ : ప్రజల ఐక్యత, పంచాయతీ పాలకవర్గ కృషి, అధికారుల సమన్వయం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ.. వెరసి ఇర్కోడు గ్రామానికి జాతీయ పురస్కారం.. సరిగ్గా రెండేండ్ల కిందట జాతీయ పురస్కారం జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఇర్కోడు గ్రామం, అదే స్ఫూర్తితో నేడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్-2019 పురస్కారానికి ఎంపికైంది. స్వచ్ఛత స్వశక్తి కరణ్-2019 అవార్డు కోసం దేశ వ్యాప్తంగా వేలాది గ్రామాల నుంచి పోటీ ఉన్న క్రమంలో, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సాంఘిక, సామాజిక అభివృద్ధి అంశంపై సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. గ్రామంలో చేపట్టిన పలు కార్యక్రమాలు జాతీయ, రాష్ట్ర స్థాయులో ఎంతగానో ఇతర గ్రామాలకు స్ఫూర్తినిచ్చేలా ఆకట్టున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ సంజీబ్ పాత్ జోషీ స్వచ్ఛత స్వశక్తి కరణ్ 2019 పురస్కారాన్ని ఇర్కోడు గ్రామానికి ప్రకటించారు. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రంతో పాటు రూ.8 లక్షల నగదు బహుమతి, దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అందుకోనున్నారు.

మంత్రి హరీశ్‌రావు కృషితో..
సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామాన్ని ఇబ్రహీంపూర్ తరహాలో జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రణాళికలు రూపొందించారు. గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలను, అధికారులను భాగస్వాములను చేస్తూ, ఎప్పకటికప్పుడు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్వచ్ఛత, వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణం, నగదు రహిత లావాదేవీలు తదితర కార్యక్రమాల్లో ఇర్కోడు గ్రామం మంచి ఫలితాలు సాధించింది. 2017-18లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజంటేషన్ రూపంలో ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో దేశ స్థాయిలో పొందే పలు అరుదైన జాతీయ పురస్కారాలు అందిపుచ్చుకునేలా, గ్రామ రూపురేఖలు మారిపోయేలా గ్రామ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. మంత్రి హరీశ్‌రావు విజన్‌కు అనుగుణంగా అనుకున్న ఫలితాన్ని పొందామని సర్పంచ్, పాలకవర్గం, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...