తొగుటలో థర్మల్ ప్రాజెక్టు పుకార్లే


Thu,September 19, 2019 11:11 PM

తొగుట: తొగుట మండలంలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటుపై వస్తున్న పుకార్లను అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొట్టిపారేశారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడారు. తొగుట మండలంలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారని, ఘనపూర్, మంతూర్, జప్తిలింగారెడ్డిపల్లి, చందాపూర్, వెంకట్‌రావుపేట, బంజేరుపల్లి తదితర గ్రామాలు ఖాళీ చేస్తారని పుకార్లు లేవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తొగుటలో థర్మల్ ప్రాజెక్టు అవసరం లేదని, ప్రభుత్వం అక్కడ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం లేదని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగునీటి గోస తీర్చుతామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మొత్తం 319 చెరువులు, 1,13,936 ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు. అవసరమైన కాలువలకు ఓటీలు ఏర్పాటు చేసి అన్ని చెరువు, కుంటలకు నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడంతో రాబోయే రోజుల్లో టూరిజం స్పాట్‌గా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్నాళ్లు థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తారని ఆందోళన చెందిన తొగుట మండలంలోని గ్రామాల ప్రజలు మంత్రి ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...