కలిసికట్టుగా..చూడచక్కగా


Thu,September 19, 2019 12:47 AM

-కొల్గూరులో ఉద్యమంలా ప్రగతి పనులు
-పారిశుద్ధ్యం, పాతఇండ్ల కూల్చివేత
-ఇంటింటికెళ్లి అధికారులు, నాయకుల అవగాహన
-ప్రతి వార్డుకు 20 మంది ఉపాధి కూలీలు
-ప్రతిరోజు 10 ఇండ్ల పరిసరాలు శుభ్రం
-ఐదురోజుల్లో గ్రామాన్ని శుభ్రం చేసేలా పనులు
-పెంటకుప్పల స్థానంలో పూలతోటలు

గజ్వేల్ రూరల్ : సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా కొల్గూరు గ్రామం అడుగులు వేస్తున్నది. సంవత్సరాలుగా పారిశుద్ధ్యాన్ని విస్మరించి రోగాల బారిన పడుతున్న ప్రజలందరూ 30రోజుల కార్యచరణతో ఆరోగ్య పరిసరాల ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. ఈ నెల 13న ఆర్థికమంత్రి హరీశ్‌రావు కొల్గూరుకు వచ్చి.. సీఎం కేసీఆర్ రూపొందించిన కార్యచరణ పకడ్బందీగా చేపట్టాలని గ్రామస్తులకు సూచించారు. ప్రత్యేకాధికారి, ఆర్ అండ్ బీ డీఈ బాలప్రసాద్, ఎంపీడీవో దామోదర్‌రెడ్డి, సర్పంచ్ మల్లంరాజు, ఎంపీటీసీ గొడుగు జ్యోతి, గ్రామకార్యదర్శి సంధ్య 30 రోజుల కార్యచరణ రూపొందించారు.

యుద్ధప్రాతిపదిన పనులు..
ఐదు రోజుల్లో గ్రామ పరిసరా లను శుభ్రం చేయాలని లక్ష్యంగా ప్రత్యేకాధికారి బాలప్రసాద్ సిబ్బందితో ప్రణాళిక రూపొందించారు. గ్రామంలోని 10 వార్డులకు వార్డు సభ్యులు ఇన్‌చార్జిలుగా, ఇద్దరు ఉపాధి మేట్‌లు సహాయకులుగా ఉంటారు. ప్రతి మేట్.. 10 మంది ఉపాధి సిబ్బంది.. ప్రతి ఇం టికి ఐదుగురు కూలీలను ఉంచి పరిసరాలను శుభ్రం చేయించాలి. ప్రతి వార్డులో రోజు కు 10 ఇండ్లు, పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలి. ఇండ్ల వద్ద తొలగించిన చెత్తాచెదారాన్ని వెంటనే ట్రాక్టర్లలో చెత్తను తరలించాలి. ఐదు రోజుల్లో గ్రామం శుభ్రం కావాలి.

బుధవారం చేపట్టిన కార్యచరణ పనులు...
నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం బుధవారం ఉదయం 8.30 గంటల నుండే అందరూ పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యేకాధికారి, సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్యదర్శి.. ఒక్కో వార్డులో పనులను పరిశీలిస్తూ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ, పాఠశాలల గోడలపై పారిశుద్ధ్యాన్ని ప్రతిబింబించే బొమ్మలను వేయించారు. ముందుగా మల్లేశ్‌గౌడ్ ఇంటి పెరడు దోమలకు ఆవాసంగా మారింది. ఉపాధి సిబ్బందితో అక్కడ స్వచ్ఛత పనులు నిర్వహించి మల్లేశ్‌గౌడ్ ఇంటిపెరడు పూలతోటలా మార్చారు. అంగన్‌వాడీ కేంద్రం ఆవరణ, మైసమ్మ ఆలయం వెనుక భాగంలో కూలిన ఇండ్ల మట్టి, పిచ్చిమొక్కలను జేసీబీ సహయం తో తొలిగించారు. ఎవరికి వారే.. తమ ఇంటి ఆవరణ, ఇంట్లో ని పాత సామన్లు, ఇంటి పరిసరాల్లోని గడ్డి, పిచ్చిమొక్కలను తొలగించేలా అవగాహన కల్పించి పనులు చేయించారు. ప్రజలంతా తమ ఇండ్లలోని పాత సామన్లు, పనికిరాని వస్తువులను బయట పడేశారు.

మూడు గంటల్లోనే 3 ట్రాలీ ఆటోల నిండా పాత సామన్లు నిండిపోయాయి. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అధికారులే స్వయంగా వెళ్లి పాత సామన్లను బయటవేసి యజమానులతో మాట్లాడి బయట వేస్తున్నారు. కొల్గూరు ప్రధాన రహదారిలో ఉన్న గొడుగు సత్యనారాయణ ఇంట్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించగా 3 ట్రాక్టర్ల చెత్తను జమఅయ్యింది. అలాగే, అతడి ఇంట్లో 2ట్రాక్టర్ల నిండా పాతసామన్లు కనిపించడంతో వెంటనే తొలగించాలని సూచించారు. అనంతరం బాలసంత గుడిసెల వద్ద చేస్తున్న పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని పాతబడ్డ ఇండ్లను తొలగిస్తూ ఆ మట్టితో అదే ప్రాంగణంలోని పాత బావిని పూడ్చారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...