హుస్నాబాద్ అభివృద్ధికి కృషిచేస్తా


Thu,September 19, 2019 12:46 AM

హుస్నాబాద్‌టౌన్: హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని స్ఫూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆత్మీయసన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ నుంచి వెళ్లే జాతీయ రహదారితోపాటు హుస్నాబాద్ ప్రాంతానికి రైల్వేలైన్ నిర్మాణం కోసం పాటుపడుతానని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగానే తన జీవితం సాగుతుందని, ధర్మంకోసం, దేశంకోసం తాను పాటుపడుతానని సంజయ్‌కుమార్ చెప్పారు. కేంద్రం ద్వారా వచ్చే నిధులను హుస్నాబాద్ ప్రాంతానికి కేటాయిస్తానని, మున్సిపల్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తిఅసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్ అధ్యక్షత వహించగా, చిగురుమామిడి సింగిల్‌విండోచైర్మన్ కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వరయోగుల తిరుమల్లయ్య, భార్గవపురం సేవాసమితితోపాటు పలు సంస్థలకు చెందిన కె. కొత్తపల్లి ఆశోక్, చిట్టి దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్, కొండ్లె శంకర్, గౌరిశెట్టి సత్యనారాయణ, వీరసోమయ్య, మల్కిరెడ్డి మోహన్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్, లక్కిరెడ్డి తిరుమలతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీ సంజయ్‌కుమార్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...