పౌష్టికాహారంతోనే ఆరోగ్యం


Thu,September 19, 2019 12:45 AM

గజ్వేల్‌రూరల్ : పౌష్టికాహారం తీసుకుంటేనే చిన్నారులు, పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ దాసరి అమరావతి శ్యాంమనోహర్ అన్నారు. బుధవారం జాలిగామలోని 1,2,3 అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివయ్య, ఎంపీటీసీ రాజిరెడ్డి, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

మర్కూక్ : పోషక విలువలతోనే తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మర్కూక్ ఎంపీపీ పాండు గౌడ్ అన్నారు. పాములపర్తిలోని అంగాన్‌వాడీ కేంద్రంలోని పోషక వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాములపర్తి సర్పంచ్ తిరుమల రెడ్డి, స్పెషల్ ఆఫిసర్ శ్రీకాంత్, వికాస్ రెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు సంతోషీ, సుజాత, ఏఎన్‌ఎం పాల్గొన్నారు.

కొండపాక : ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకొని జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలని సర్పంచ్ కూరెళ్ల అనురాధ అన్నారు. బుధవారం తిమ్మారెడ్డిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాల్లో భాగంగాఅవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉసర్పంచ్ రవీందర్, అంగన్‌వాడీ టీచర్లు పద్మ, రాధ, ఏఎన్‌ఎం శ్యామల, ఆశ, కవిత, గర్భిణులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...