ప్రభుత్వ కార్యాలయంలో మేకలు మేపిన వ్యక్తికి జరిమానా


Thu,September 19, 2019 12:45 AM

సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో హరితహారంలో నాటిన మొక్కలను మేకలతో మేపి నష్ట పర్చిన వ్యక్తికి జరిమానా విధించారు. పీ. బాలయ్య అనే వ్యకి పశు సంవర్ధక శాఖ కార్యాలయం ఆవరణలోని ఏపుగా పెరిగిన మామిడి చెట్లను మేకలతో సోమవారం మేపి, నష్టపరిచాడు. మంగళవారం విషయం తెలుసుకున్న సిద్దిపేట మున్సిపల్ ఉద్యానశాఖ అధికారి సామల ఐలయ్య బుధవారం సదరు వ్యక్తికి మున్సిపాలిటీ ద్వారా రూ.1500 జరిమానా విధించారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...