పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యం


Tue,September 17, 2019 11:57 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ/కొమురవెల్లి : ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని చుంచనకోట గ్రామంలో మంగళవారం చెత్తను సేకరించేందుకు సర్పంచ్ ఆది శ్రీనివాస్ ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి చెత్తను రోజువారీగా సేకరించి డంప్ యార్డుకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలోని చెత్తను తొలగించేందుకు కల్పించిన వసతిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాబు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాజారాం, కో-ఆప్షన్ సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళ సంఘాల నాయకులు, పారిశుధ్య, హరిత, వీధి దీపాల, గ్రామ అభివృద్ధి కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
లెనిన్ నగర్‌లో..
మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఆయా సర్పంచ్‌ల ఆధ్వర్యంలో 30 రోజుల ప్రణాళిక పనులు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం కొమురవెల్లి మండల కేంద్రంతో పాటు లెనిన్‌నగర్‌లో డీఎల్‌పీవో మల్లారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అన్ని విధుల్లో జరుగుతున్న పనులను పరిశీలించడంతో పాటు జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా రూపుదిద్దుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున్, సర్పంచ్ సార్ల లత, ప్రత్యేకాధికారి రాంప్రసాద్, కార్యదర్శులు ఎండీ.రఫీ, స్వర్గం సతీశ్, సనాది భాస్కర్ ఉన్నారు.

రాంసాగర్‌లో ..
మండలంలోని రాంసాగర్‌లో ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను ఎంపీడీవో మల్లికార్జున్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంసాగర్‌ను పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దుకునేందుకు గ్రామప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తాడూరి రవీందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ విజయ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...