పులి రాజుకు రైతునేస్తం అవార్డు


Tue,September 17, 2019 11:55 PM

గజ్వేల్‌టౌన్: తెలుగు రాష్ర్టాల్లో వెలువడుతున్న వ్యవసాయ మాస పత్రిక రైతునేస్తం 15వ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక సంపాదకుడు పద్మశ్రీ డాక్టర్ వెంకటేశ్వర్‌రావు వ్యవసాయ రంగంలో విశేషంగా కృషి చేసిన వర్గల్ మండలం తునికిఖల్సా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి రాజుకు రైతునేస్తం అవార్డులను మంగళవారం ప్రకటించారు. సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత ్తస్వర్గీయ పద్మశ్రీ ఐవీ సుబ్బరావు పేరిట ఈ ఏడాది అవార్డును వ్యవసాయరంగంలో కృషి చేసినందుకు గాను ఈ నెల 22న హైదరాబాద్‌లోని స్వర్ణభారతి ట్రస్టు భవనంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డును పులి రాజుకు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా పులి రాజు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రైతు ఆత్మహత్యలపై చేసిన విశేష కృషికి గాను అవార్డును ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తనకు ప్రకటించిన రైతునేస్తం అవార్డు రైతులకే అంకితమన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...