ప్రత్యేక కార్యాచరణతో పల్లెలకు కొత్త వెలుగులు


Mon,September 16, 2019 11:52 PM

హుస్నాబాద్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో పల్లెలకు కొత్త వెలుగులు వస్తున్నాయని హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస అన్నారు. సోమవారం మండలంలోని పందిల్ల గ్రామంలో ప్రత్యేక కార్యాచరణలో భాగంగా జరుగుతున్న పనులను ఎంపీపీ పరిశీలించారు. స్వయంగా ఆమె పార చేతపట్టి శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ పనులు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉద్యమంలా కొనసాగుతున్నాయన్నారు. గ్రామానికో ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీల పాలకవర్గం, కోఆప్షన్ సభ్యులు, హరితహారం, పారిశుధ్యం, వీధిదీపాలు, పనుల కమిటీల సభ్యులు ప్రణాళికబద్ధంగా పనులు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో కొన్నేండ్లుగా నెలకొన్న సమస్యలు ఈ కార్యాచరణ అమలుతో పరిష్కారమవుతున్నాయన్నారు. విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతపై వాడవాడలా తిరుగుతూ గ్రామాల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తప్పనిసరిగా వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించి పనులు చేసి ప్రజలను రోగాల భారీ నుంచి కాపాడాలన్నారు. ఆయా గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రత్యేక కార్యాచరణ అమలులో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ తోడేటి రమేశ్, వార్డు సభ్యులు, పలు కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

ఉద్యమంలా ప్రత్యేక కార్యాచరణ పనులు
అక్కన్నపేట : ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు పనులు మండల వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మండలంలోని 31 గ్రామ పంచాయతీలు ఉండగా, 31 మంది గ్రామ, మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీల పాలకవర్గం, కోఆప్షన్ సభ్యులు, హరితహారం, పారిశుధ్యం, వీధిదీపాలు, పనుల కమిటీల సభ్యులు ఉద్యమంలా పని చేస్తున్నారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో శ్రమదానం
బెజ్జంకి : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సోమవారం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలిగించారు. అదే విధంగా ప్రభుత్వం చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రణాళిక కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...