సర్కారు దవాఖానలో పరిసరాల పరిశుభ్రత


Mon,September 16, 2019 11:52 PM

హుస్నాబాద్‌టౌన్ : దవాఖాన పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు ఎవరో వస్తారని ఎదురుచూడకుండా వైద్యులు, సిబ్బంది కలిసికట్టుగా ముందుకు సాగగా స్థానిక యువత సైతం తమవంతు చేయూతనిచ్చారు. హుస్నాబాద్ సర్కారు దవాఖానలో సోమవారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖాన ఆవరణలో పెరిగిన పిచ్చిచెట్లను, చెత్తా,చెదారాన్ని తొలిగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. దవాఖాన పరిసరాలతోపాటు దవాఖానలో సైతం అపరిశుభ్రతను తొలిగించేందుకు కార్యాచరణను చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ప్రభాకర్ మాట్లాడుతూ మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ ఇంటిపరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు సైతం అవగాహన కల్పించేందుకు వైద్యసిబ్బంది కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారిని సౌమ్య, బీజేపీ నాయకులు గుత్తికొండ విద్యాసాగర్, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, బత్తుల శంకర్, వరయోగుల అనంతస్వామితోపాటు పలువురు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...