విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవంగా నిర్వహించాలి


Sun,September 15, 2019 10:31 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : కులవృత్తుల కార్మికులకు పనిముట్లు అందించిన ఆదిదేవుడు విశ్వకర్మ జయంతిని భారత కార్మిక దినోత్సవంగా నిర్వహించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి ప్రదీప్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించి కులవృత్తులపై ఆధారపడిన కార్మికుల ఆశయాలను భర్తీ చేయాలని కోరారు. విశ్వకర్మ జయంతిని ఈ నెల 17న కార్మిక దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో భారతీయ మజ్దూర్ సంఘ్ పోరాటం చేస్తుందని అన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, విజయ్‌కుమార్, నర్సింహారెడ్డి, అశోక్, శ్రీనివాస్, భరత్‌రెడ్డి, గణేశ్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...