ఘనంగా లలిత సహస్రనామ పారాయణం


Sun,September 15, 2019 10:31 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : మహిళలు వివిధ రూపాల్లో అమ్మవారిని కొలుస్తూ ఘనంగా లలిత సహస్రనా పారాయణం చేశారు. ఆదివారం సదాశివపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సుహాసిని పూజలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వరశర్మ సిద్ధాంతి హాజరై కన్యకాపరమేశ్వరి చరిత్ర, ప్రవచనాలను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య అధ్యక్ష, కార్యదర్శులు మాశెట్టి ప్రకాశం, పురం సుధాకర్, తాటికొండ రాజయ్య, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అనుముల సాయిరాజ్, మల్లికార్జునశంకర్, పార్శం భిక్షపతి, యువజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నగేశ్, నరేశ్, కార్తీక్, సభ్యులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...