చేనేత శ్రేయస్సుకు ప్రభుత్వం కృషి మరువలేనిది


Sat,September 14, 2019 11:11 PM

సిద్దిపేట టౌన్: చేనేత కార్మికుల శ్రేయస్సుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిదని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు డా.కస్తూరి సతీశ్ అన్నారు. సిద్దిపేటలో శనివారం వారు మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలుపడానికి వచ్చే వారిని పూలమాలలు, బొకేలు తీసుకరావద్దని చేనేత కార్మికులు నేసిన తువ్వాలలు మాత్రమే తీసుకురావాలని చెప్పడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. చేనేత రంగానికి కార్మిక శ్రేయస్సుకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు చేస్తున్న కృషి అనిర్వచణీయమన్నారు. చేనేత రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు సంగు పురేందర్, బూర మల్లేశం, లగిశెట్టి సతీశ్, శ్రీశైలం తదితరులు ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...