పిల్లల పండుగలో సిద్దిపేట కవులు


Sat,September 14, 2019 11:11 PM

సిద్దిపేట టౌన్: రంగినేని ట్రస్టు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం జరిగిన పిల్లల పండుగ కార్యశాలలో సిద్దిపేట కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవులు మాట్లాడుతూ రంగినేని ట్రస్టు వారు పిల్లల పండుగ చేపట్టడం అభినందనీయమన్నారు. బాలల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు ఈ పండుగ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీతలు భూపాల్‌రెడ్డి, వెంకటరమణ, డా.పత్తిపాక మోహన్, గరిపల్లి అశోక్‌లు బాల సాహిత్య రచయితల కృషిని కొనియాడారు. కార్యక్రమంలో కవులు ఉండ్రాల రాజేశం, యాదగిరి, వేణుమాధవ్‌శర్మ, పర్శరాములు, రంజిత్‌కుమార్, చరణ్‌సాయిదాస్, బసవయ్య, వెంకటేశ్వర్లు, దుర్గయ్య పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...