దొంగతనం కేసులో ఇద్దరి రిమాండ్


Sat,September 14, 2019 11:11 PM

మిరుదొడ్డి : దొంగ తనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను రిమాండుకు తరలించిన సంఘటన భూంపల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం జరిగింది. ఎస్‌ఐ కె.రాజేశ్ వివరాల ప్రకారం.. భూంపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫాంలో ఈ నెల 9వ తేదీ రాత్రి దొంగతనం జరిగింది. ఫాం యజమాని తామస్ జాన్సన్ ఇచ్చిన ఫిర్యాదుతో భూంపల్లి, అక్బర్ గ్రామాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా పుటేజీల్లో ట్రాలీ ఆటోలో ఇద్దరు వ్యక్తులు సదరు పౌల్ట్రీ నుంచి వస్తువులు తీసుకుని పోతున్నట్లు గుర్తించారు. దీంతో 14న తనిఖీ చేస్తున్న క్రమంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నామన్నారు. వారిని విచారణ చేయగా దుబ్బాక మండల పరిధిలోని నగరం గ్రామానికి చెందిన బైరి నాగేశ్, పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన స్వామి ఇద్దరు కలిసి 9వ తేదీ రాత్రి భూంపల్లి పౌల్ట్రీ ఫాంలో దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

పౌల్ట్రీ ఫౌం నుంచి ఒక ఫ్రిజ్, రెండు గ్యాస్ సిలెండర్లు, ఒక గ్యాస్ స్టవ్‌తో పాటు కలిపి రూ.30 వేలు విలువ చేసే వస్తువులను ట్రాలీలో దొంగతనం చేశామన్నారు. వారి ఇండ్లల్లో సోదాలు చేయగా నగేశ్ ఇంట్లో సిలిండర్, ఫ్రిజ్, స్వామి ఇంట్లో సిలిండర్, స్టవ్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే నగేశ్ తన చిన్న తనంలోనే నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పట్టణంలో బైక్‌ను దొంగతనం చేయండతో పాటు, రెండు ఏండ్ల కిందట పెద్ద నిజాంపేట జడ్పీ పాఠశాల నుంచి టీవీని కూడా దొంగతనం చేసి ఇంట్లో వాడుకుంటున్నాడు. టీవీని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని ఎస్ తెలిపారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...