జల వనరులను కాపాడాలి


Sat,September 14, 2019 11:10 PM

రాయపోల్ : జల వనరులను కాపాడుకోని భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జలశక్తి అభియన్ కేంద్ర బృందం నోడల్ అధికారి ముఖేశ్‌కుమార్ ఝా పేర్కొన్నారు. మండ లంలోని కొత్తపల్లి, రామారం గ్రామాల్లో శనివారం ఉపాధి పథకం ద్వారా చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ, నీటి గుంతలు, కుంటలు, తదితర వాటిని పరిశీలించారు. హరితహరం మొక్కల పెంపకంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నీటి చుక్కను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధి పథకంలో నీటి గుంతలు, మొక్కల పెంపకం, కందకాలను నిర్మించుకోవాలన్నారు.

కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు పరశురాం, ఎంపీపీ కె.అనితాశ్రీనివాస్, ఎంపీడీవో స్వర్ణకుమారి, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, ఏపీవో నర్సింహారెడ్డి, ఇరిగేషన్ ఏఈ తిరుపతి, రామారం సర్పంచ్ సరోజహన్మంతు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...