రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


Sat,September 14, 2019 04:04 AM

సూర్యాపేటవ్యవసాయం : స్వచ్ఛ పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరియల్ అధికారి గోనె రవి అన్నారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 236మంది విద్యార్థులు హాజరు కాగా 6 విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, స్థానంలో నిలిచిన 12మందిని ఎంపిక చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు వ్యాసరచన ఎ.తులసి, ఎస్.కె.సనా, టాలెట్‌టెస్ట్‌లో సీహెచ్.శ్రీనాత్, జి.గ్రీష్మ, మహాత్మునికి లేఖ విభాగంలో జూనియర్స్ ఎల్.వసంత, బి.హేమంత్, సీనియర్ విభాగంలో డి.సుశ్మిత, డి.వసంత, పేయింటింగ్ జూనియర్ విభాగంలో ఎస్.కె.అయోషాభాను, డి.నవ్య, సీనియర్స్‌లో ఎం.ప్రవళిక, టి.పూజిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...