మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి


Sat,September 14, 2019 04:04 AM

బొడ్రాయిబజార్ : సూర్యాపేట పట్టణ ప్రజలు తమ ఇండ్లు, పరిసరా ల్లో వర్షంనీరు, మురికినీరు నిల్వ లేకుండా చూసుకొని దోమల నిర్మూళనకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అన్నాదురైనగర్ స్లమ్ ప్రాంతంలోని పరిసరాలు, గాబులను, నల్లా ట్యాంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. నిలువనీటిలో దోమలు పెరిగి రోగాలకు కారణమవుతాయన్నారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకుంటూ రోగాలకు దూరంగా ఉండాలన్నారు. చెత్తచెదారంను మున్సిపల్ ట్రాక్టర్‌కు అందివ్వాలని మురికి కాలువల్లో వేయవద్దన్నారు. కార్యక్రమంలో శానిటరి ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, జవాన్లు కొండేటి వెంకన్న పాల్గొన్నారు.

17
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...