ఓటరు కార్డులోని తప్పులను సరిదిద్దుకోవాలి


Sat,September 14, 2019 04:04 AM

భానుపురి : ఓటరు కార్డులోని తప్పులను సరిదిద్దుకోవాలని ఆర్డీఓ మోహన్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశా ల సెమినార్ హాల్లో భారత ఎన్నికల సంఘం ఓటర్ల సౌకర్యార్థం తయారు చేసిన సంక్షిప్త సవరణ మొబైల్ యాప్‌ను విద్యార్థులకు పరిచయం చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొత్త వారు ఏ వి ధంగా ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి, పాత వారు తమ ఓటర్ కార్డులోని ఎపిక్ నెంబర్ సహాయంతో తమ ఓటును ఎలా మార్చుకోవాలో వివరించారు. డిప్యూటీ తహసీల్దార్ రాంరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో ఓ టర్ కార్డులోని తప్పులను ఏవిధంగా సరిచేసుకోవాలి అన్న విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవీంద్రచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి.వెంకటేశులు, కలెక్టరేట్ సిబ్బంది గఫార్, శ్రీధర్, గౌతమ్, శ్రీనివాస్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...