అన్ని సమస్యలు పరిష్కరిస్తాం


Sat,September 14, 2019 04:03 AM

చివ్వెంల : మీరు ఎదుర్కొనే ప్రతీ సమస్యను పరిష్కరించేందుకే మేమున్నామని జడ్పీటీసీ భూక్యా సంజీవనాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వాల్యాతండాలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు మండలంలో వారానికి ఒక గ్రామపం చాయతీని సందర్శించి గ్రామంలో నెలకొన్న ప్రతీ సమస్య పరిష్కారం దిశగా పనిచేస్తున్నామన్నారు. అధికారుల సహకారంతో సమస్యలు గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు గ్రామ పంచాయతీల్లో 85శాతం భూముల సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పి.సైదులు మాట్లాడుతూ సాదా కాగితాలపై ఎక్కువశాతం ప్రజలు భూములు కొనుగోళ్లు జరుపుతున్నారని గుర్తించినట్లు తెలిపారు. సాదా కాగితాలపై భూములు కొనుగోలు చే యవద్దని సూచించారు. భూములకు సంబంధించి 32దరఖాస్తులు రాగా వాటిలో 21మంది సమస్యలు సత్వరమే పరిష్కరించినట్లు తెలిపారు. మిగతా వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న 30రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, సర్పంచ్ ధరావత్ శిరీషవీర, ఉపసర్పంచ్ ధరావత్ చావ్లా, కృష్ణ, నాగులు పాల్గొన్నారు.

17
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...