జలసంరక్షణ చర్యలు అద్భుతం


Fri,September 13, 2019 11:34 PM

కొమురవెల్లి/కోహెడ : జలసంరక్షణ కోసం జి ల్లాలో చేపడుతున్న చర్యలు బాగున్నాయని కేంద్ర జలశక్తి అభియాన్ బృందం ప్రశంసించింది. శుక్రవారం ఐఏఎస్ అధికారి ముఖేశ్‌కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి అభియాన్ బృందం కొమురవెల్లి మండలం రసూలాబాద్, కోహెడ మండ లం గుండారెడ్డిపల్లిలో పర్యటించింది. రసూలాబాద్‌లో జలసంరక్షణ కోసం జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేసింది. గుండారెడ్డిపల్లిలో ఒగ్గెవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం, ర్యాక్‌ఫిల్ డ్యాం, ఖండిత కందకాలు, మొక్కల పెంపకం, సంరక్షణ పనులను పరిశీలించింది. భూగర్భజలాల పెంపునకు జరుగుతున్న పనులను గ్రామస్తులను అడిగి తెలుసుకుంది.

ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకునేందుకు గ్రామాల్లో ఇంకుడు గుంతలు ముమ్మరంగా చేపట్టాలని సిబ్బందికి సూచించింది. బృందం వెంట రసూలాబాద్ సర్పంచ్ స్వామిగౌడ్, ఎంపీడీవో మల్లికార్జున్, స్పెషల్ ఆఫీసర్ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్, ఉపసర్పంచ్ సురేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, గుండారెడ్డిపల్లిలో ఐబీ ఏఈ రావీష్, ఏపీవో శిరీష, ఈఈ రాజబాబు, మాజీ సర్పంచ్ సుతారి కనుకయ్య, ఉప సర్పంచ్ భూంపెల్లి సంజీవరెడ్డి, నాయకులు మద్దెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...