పేద ప్రజల కోసమే డబుల్ బెడ్‌రూం ఇండ్లు


Fri,September 13, 2019 03:26 AM

దౌల్తాబాద్ : పల్లెల్లో కడు పేదరికాన్ని అనుభవిస్తున్న పేద ప్రజలకు నివాస గూడును కల్పించడానికే సీఎం కేసీఆర్ ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి అందిస్తున్నారని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. గురువారం దొమ్మాటలో నిర్మిస్తున్న 40 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించారు. అనంతరం గ్రామంలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా, బాలవికాస ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను, గ్రంథాలయాన్ని ప్రారంభించి, గ్రామస్తులకు తడిపొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఎందరో ప్రజలు ఇండ్లు లేకుండా చలికి వణుకుతూ, వానలకు తడుస్తూ, ఎండలకు ఎండుతున్న వారికి సొంత గూడును నిర్మించి ఇవ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.

స్వచ్ఛమైన నీరే సురక్షితం..
బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అదించే నీరే స్వచ్ఛమైనదన్నారు. ప్రజలు స్వచ్ఛమైన నీటిని వాడి ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న బాలవికాస స్వచ్ఛంద సంస్థను అభినందించారు. విద్యార్థులు యువకులు గ్రంథాయంలోని పుస్తకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను చేరాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయాలైన టీఆర్‌ఎస్ నేత కరికె అశోక్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ గంగాధరి సంధ్య, జడ్పీటీసీ రణం జ్యోతి, సర్పంచ్ కుమ్మర పూజిత, ఎంపీటీసీ, గన్నమనేని లక్ష్మి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు రహీమొద్దీన్, వైస్ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు అహ్మద్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు నర్ర సత్యం, టీఆర్‌ఎస్ నేతలు రాజేందర్, సల్లా స్వామి పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...