మట్టపల్లి ఆలయానికి మళ్లీ వరద పోటు


Thu,September 12, 2019 04:26 AM

-ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ
-మరోసారి మునిగేనా..? ఆందోళనలో ఆలయ సిబ్బంది, భక్తులు

హుజూర్‌నగర్, నమస్తే తెలంగాణ : పైనుంచి వస్తున్న వరదల కారణంగా నాగార్జున సాగర్ 24క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత నెల 13 నుంచి 10రోజుల పాటు వచ్చిన వరదలకు పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మట్టపల్లి లక్ష్మీనృసింహుడి ఆలయాన్ని రెండు మార్లు కృష్ణానీరు ముంచేసింది.ఈ నెల మంగళవారం 10 నుంచి వస్తున్న వరదలకు ఆలయం వద్ద ఎఫ్‌ఆర్ లెవల్ 53.34కు చేరువగా నీరు ప్రవహిస్తోంది. గతంలో రక్షణ గోడకు ఏర్పడిన లీకేజీల కారణంగా నీరు ఆలయంలోకి ప్రవహించిందని ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ ఉధభాస్కర్ తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు, ఆలయం వద్ద ప్రవాహ ఉధృతిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి 2లక్షల 31వేల నీరు వస్తుండగా కృష్ణాబ్యారేజీకి 3లక్షల 3వేలు నీటిని దిగువకు వదులుతున్నారు. 15రోజులుగా ప్రశాంతంగా కనిపించిన కృష్ణమ్మ మళ్లీ ఉధృతిగా ప్రవహించడంతో కృష్ణాపరీవాహక ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మళ్లీ ఎన్నిరోజులు ఇలా ఉంటుంది..ఆలయం ముచ్చటగా మూడోసారి మునుగుతుందా..ఆలయం ముంపునకు గురి కాకుండా పరిష్కార మార్గం లేదా అనే అనుమానాలు భక్తులు, ప్రజల మనస్సులో మెదులుతున్నాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
కృష్ణాపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్‌ఐ మహేష్‌లు సూచించారు. సాగర్ గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహం మళ్లీ పెరిగిందని పులిచింతల ప్రాజెక్టులో ముసళ్ళు ఉన్నాయని, వరద ఉధృతి ప్రవహించే ప్రాంతాల్లో సంచరిస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. గణేష్ నిమజ్జనానికి వచ్చే ఉత్సవ కమిటీ సభ్యులు,నిర్వాహకులు సహకరించాలన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...