ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం


Thu,September 12, 2019 04:23 AM

మిర్యాలగూడ టౌన్: ఉపాధ్యాయులెదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. బుధవారం మి ర్యాలగూడ పట్టణానికి వచ్చిన ఆయన పీఆర్టీయూ ఉ పాధ్యాయ సంఘ ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. పీఆర్టీయూ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రఘోత్తమరెడ్డిలతో కలిసి ఉపాధ్యాయరంగ సమస్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌లతో చర్చించినట్లు పేర్కొన్నా రు. అంతర్ జిల్లాల బదిలీలు, జీఓ 15 ప్రకారం పండిట్, పీఈటీల ప్రమోషన్లు, మేనేజ్‌మెంట్ వారీగా ప్రమోషన్లకు వారు ఒప్పుకున్నట్లు తెలిపారు. మోడల్‌స్కూల్, కేజీబీవీల సమస్యలను పరిష్కరించాలని మంత్రులను కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎంఈఓ బాలాజీనాయక్, నర్సింహ, సీతారాములు, సైదులు, గోపి, కాశీ, సైదులు, శ్రీనివాస్‌రెడ్డి, జనార్దన్ తది తరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...