మహిళను కాపాడిన పోలీసులు


Thu,September 12, 2019 04:23 AM

నందికొండ : ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన మహిళను పోలీసులు కాపాడిన ఘటన నాగార్జునసాగర్‌లో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన రాజమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఆమె మనస్థాపానికి గురై కుటుంబసభ్యులకు చెప్పకుండా ఆత్మహత్య చేసుకోవడానికి నాగార్జునసాగర్‌కు వచ్చింది. కుటుంబసభ్యుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు సీఐ వేణుగోపాల్ సారధ్యంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద మహిళను గుర్తించిన పోలీసులు మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. మహిళ దొరకడంతో పోలీసులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...