గ్రామీణ చిన్నారులకు ప్రయోజనం..


Thu,September 12, 2019 04:23 AM

బాలమృతం పథకం గ్రామీణ చిన్నారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. పల్లెల్లో చిన్నారులు శారీరక, మానసిక అభివృద్ధికి అనుబంధ పోషకాహారంగా బాలామృతం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పేద కుటుంబాల్లోని చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి వారి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ బాలామృతం ప్యాకెట్లను ప్రతీ అంగన్‌వాడి కేంద్రానికి పంపిణీ చేస్తుంది.

పోషకాలు అనేకం..
బాలామృతాన్ని 9రకాల పోషకాలతో తయారు చేస్తారు. కాల్షియం, ఐరన్, విటమిన్-ఏ, బీ1, సీ, పోలిక్ యాసిడ్, నియాసిన్, ఖనిజ లవణాలు ఉంటాయి. వేయించిన శనగపప్పు, గోధుమపిండి, రిఫైండ్ ఆయిల్, పంచదార, స్కీమ్‌డ్‌మిల్క్ ఫౌడర్‌తో కలిపి రుచికరంగా తయారు చేస్తారు. నెలలో 25రోజులు మాత్రమే చిన్నారులకు అందిస్తారు. రోజుకు 100 గ్రాముల చొప్పున బాలామృతాన్ని తినిపించాలి. 6నెలల నుంచి ఏడాది వయస్సు ఉన్న పిల్లలకు పాలల్లో కలిపి పెట్టాలి. ఏడాది నుంచి మూడేళ్లు వయస్సు ఉన్న పిల్లలకు పాలు లేదా వేడినీళ్లలో ముద్దగా చేసి తినిపించాలి. ఐదేళ్ల లోపు వయస్సు గల చిన్నారుల ఎదుగుదలకు బాలామృతం ఎంతో కీలకమని ఐసీడీఎస్ అధికారులు పేర్కొంటున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...