సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరికలు


Thu,September 12, 2019 04:22 AM

చిలుకూరు : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని పోలేనిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తిరుగమళ్ల రాజయ్య ఆధ్వర్యంలో సుమారు 200మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిరంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. కొత్త, పాత లేకుండా నాయకులంతా సమన్వయంతో పని చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బట్టు శివాజీనాయక్, నాయకులు కొండా సైదయ్య, తాళ్లూరి శ్రీనివాస్, మొలుగూరి నాగరాజు, ఎగ్గడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...